Economy: మూడో త్రైమాసికంలో భారత వృద్ధి 6.4 శాతం: ఇక్రా

by S Gopi |

వినియోగం తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యయం పెంచింది. దాని కారణంగా వృద్ధి మెరుగ్గా ఉంటుందని ఇక్రా తెలిపింది.

Economy: మూడో త్రైమాసికంలో భారత వృద్ధి 6.4 శాతం: ఇక్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతంగా నమోదవ్వొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ప్రధానంగా వినియోగం తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యయం పెంచింది. దాని కారణంగా వృద్ధి మెరుగ్గా ఉంటుందని మంగళవారం ప్రకటనలో ఇక్రా తెలిపింది. అంతకుముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత ఆర్థికవ్యవస్థ 6.7 శాతంగా ఉంది. అయితే, సార్వత్రిక ఎన్నికలు, బలహీన వినియోగ డిమాండ్ వల్ల ప్రభుత్వ వ్యయం తగ్గడంతో సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి 5.4 శాతానికి క్షీణించింది. ఆ తర్వాత డిసెంబర్ త్రైమాసికంలో దేశంలో ఆర్థిక పనితీరు మెరుగుపడటం, ప్రభుత్వం ఖర్చులు పెంచడం, సేవల ఎగుమతులు అధికంగా పెరగడం, సరుకుల ఎగుమతులు కూడా సానుకూలంగా ఉండటం, గ్రామీణ ప్రాంతంలో ఉత్పాదకత వల్ల ఆర్థికవ్యవస్థకు ఎక్కువ ప్రయోజనాలు లభించాయని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల సెంటిమెంట్ కొంత తగ్గినప్పటికీ మైనింగ్, విద్యుత్ వంటి రంగాలు మెరుగుపడ్డాయి. వీటికి తోడు పండుగ సీజన్ కారణంగా కీలక వినియోగ రంగాలు పుంజుకున్నాయి. ఫలితంగా వృద్ధి మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నామని అదితి నాయర్ తెలిపారు.

Next Story