- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aadhar: త్వరలో ఈ-ఆధార్ యాప్
ఈ యాప్‌ను ఉపయోగించి వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆధార్ యూజర్లు, హోల్డర్ల కోసం భారత ప్రభుత్వం ఒక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఆధార్‌కు సంబంధించి ప్రాథమిక అవసరాలకు ఆధార్ సెంటర్లకు వెళ్లే పనిలేకుండా ' ఈ-ఆధార్ యాప్' మొబైల్ యాప్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అభివృద్ధి(యూఐడీఏఐ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ యాప్‌ను ఉపయోగించి వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే, దీన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభించాలని భావిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలలో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మరిన్ని వివరాలను అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది.
ఈ-ఆధార్ యాప్ అంటే?
వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌ల నుండే వారి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి కీలకమైన వ్యక్తిగత వివరాలను ఆధార్ కార్డులో అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఆధార్ మొబైల్ అప్లికేషన్ పనిచేస్తుంది. ఈ డిజిటల్ పరిష్కారం ద్వారా చాలామంది ఆధార్ సెంటర్లకు నేరుగా వెళ్లే సమయం, శ్రమ తగ్గించే అవకాశం ఉంటుంది. ఫేస్ ఐడీ టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని అనుసంధానించడం ద్వారా వేలిముద్ర, కళ్ల ఐడెంటిటీ లాంటి బయోమెట్రిక్ మార్పులు చేసుకునేందుకు ఈ యాప్ దేశవ్యాప్తంగా సురక్షితమైన, సజావుగా డిజిటల్ ఆధార్ సేవలను అందిస్తుంది.
కొత్త నిర్ణయం అప్‌డేట్ ప్రక్రియను సులభతరం చేయడం, పేపర్‌వర్క్ అవసరాన్ని తొలగించడం, ఐడెంటిటీ మోసాలను తగ్గించడం, వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఆధార్ ప్రక్రియ అందించే లక్ష్యంతో ఉంటుంది.






