- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dr. Reddy’s Lab: టైప్ 2 డయాబెటిస్‌కి సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ లాంచ్ చేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్
ఈ ఔషధం జెనరిక్ వెర్షన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఆమోదం పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా డా రెడ్డీస్ ల్యాబ్ నిలిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ శనివారం టైప్ 2 డయాబెటిస్ కోసం 'ఒబెడా' అనే సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌ను విడుదల చేసింది. ఈ ఔషధం జెనరిక్ వెర్షన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఆమోదం పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా డా రెడ్డీస్ ల్యాబ్ నిలిచింది. సెమాగ్లుటైడ్ ఔషధానికి మనదేశంలో పేటెంట్ గడువు ముగియడంతో, కంపెనీ దీని జనరిక్ ఔషధాన్ని లాంచ్ చేసింది. కంపెనీ ఈ ఒబెడా బ్రాండ్ ఔషధాన్ని 2ఎంజీ, 4ఎంజీ మోతాదులలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వారానికి ఒకసారి ఇచ్చేందుకు వీలుగా, డిస్పోజబుల్ పెన్ రూపంలో ఇది లభిస్తుంది. ప్రతి పెన్ కనీసం నాలుగు వారాల డోసులను అందిస్తుంది. ఈ రెండు మోతాదులకు కలిపి ధర నెలకు రూ. 4,200 నుంచి ప్రారంభమవుతుందని డా రెడ్డీస్ లాబొరేటరీస్ వెల్లడించింది. ఇది గ్లోబల్ కంపెనీ నోవో నార్డిస్క్ ధర కంటే 60 శాతానికి పైగా తక్కువని కంపెనీ తెలిపింది. వైద్యపరంగా సెమాగ్లుటైడ్ ఔషధం, టైప్-2 డయాబెటిస్‌తో పాటు బరువును తగ్గించడం, గ్లూకోజ్ స్థాయిలను నిలువరించడంతో మెరుగైన ఫలితాలు ఇచ్చిందని కంపెనీ పేర్కొంది.






