- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telecom Department: టాటా కమ్యూనికేషన్స్‌కు రూ. 7,800 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చిన టెలికాం శాఖ
2005-06 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించి ఈ ఏడాది జూన్ నాటికి రూ. 7,827.55 కోట్ల విలువైన ఏజీఆర్ బకాయిలు..

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని టెలికాం విభాగం టాటా కమ్యూనికేషన్స్ భారీ మొత్తానికి సంబంధించి పన్ను నోటీసులను అందుకుంది. బకాయిలకు సంబంధించి రూ. 7,800 కోట్లను చెల్లించాలని షోకాజ్, డిమాండ్ నోటీసులను టెలికాం శాఖ అందజేసింది. 2005-06 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించి ఈ ఏడాది జూన్ నాటికి రూ. 7,827.55 కోట్ల విలువైన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలు ఉన్నాయని టెలికాం శాఖ తన ఉత్తర్వులు ఇచ్చిందని టాటా కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ లక్ష్మీనారాయణ్ తెలిపారు. డిమాండ్ నోటీసులలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ఐఎస్‌పీ) లైసెన్స్ కింద 2010-11 ఆర్థిక సంవత్సరం, జాతీయ లాంగ్ డిస్టెన్స్(ఎన్ఎల్‌డీ) లైసెన్స్ కింద 2006-07, 2009-10 సంవత్సరాలకు సంబంధించిన చెల్లింపులపై కంపెనీ క్లెయిమ్ చేసిన డిడక్షన్ రూ. 276.68 కోట్లు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మొత్తం ఐఎల్‌డీ, ఎన్ఎల్‌డీ, ఐఎస్‌పీ లైసెన్సులకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు, టెలికాం ట్రిబ్యునల్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, ప్రభుత్వ ప్రాథిక లెక్కింపు ప్రకారం, అన్ని టెలికాం కంపెనీలు 2018-19 వరకు మొత్తం ఏజీఆర్ బకాయిలలో దాదాపు రూ. 1.65 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉంది. 2022, మార్చి నాటికి భారతీ ఎయిర్‌టెల్ రూ.31,280 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ.59,236.63 కోట్లు, రిలయన్స్ జియో రూ.631 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.16,224 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.5,009.1 కోట్లు చెల్లించాలి. ఆ సమయంలో టాటా కమ్యూనికేషన్స్ బకాయిలను పేర్కొనలేదు.






