Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నారా? ఇలా చేశారో మూడేళ్లు జైలు శిక్ష ఖాయం

by Vennela |

Aadhaar Card: ప్రస్తుతం నేటికాలంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నారా? ఇలా చేశారో మూడేళ్లు జైలు శిక్ష ఖాయం
X

దిశ, వెబ్ డెస్క్: Aadhaar Card: ప్రస్తుతం నేటికాలంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు లోన్ల వరకు అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డ్ లేనిదే సిమ్ కార్డు కూడా ఇవ్వరు. అలాంటి ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తే జైలు శిక్ష పడుతుందని మీకు తెలుసా. ఆధార్ కార్డు డేటా, ఫింగర్ ప్రింట్ , ఐరిస్ స్కాన్స్ లను బయోమెట్రిక్ పరికరాలు ప్రత్యేక ఐడీ కోసం కాప్చర్ చేస్తాయి. ఈ డేటాను ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వారికి భారీగా జరిమానా విధించవచ్చు. UIDAI నియమాలు, 2021 ప్రకారం UIDAI అనధికారిక యాక్సెస్ లేదా UIDAI ఆదేశాల ఉల్లంఘనకు జరిమానా విధించవచ్చు.

ఒక వ్యక్తి ఆధార్ కు సంబంధించి వివరాలను ఫోర్జరీ చేయడం లేదా మార్చడం లాంటివి చేసినట్లయితే ఫేక్ ఆధార్ చేయడం కూడా నేరం. అలా చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు. ముందుగా మైఆధార్ వెబ్ సైబ్ కు వెళ్లి లాగిన్ అవ్వండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ను నమోదు చేసి క్యాప్చా కోడ్ ను పూరించండి. ఓటీపీతో లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

ఇప్పుడు అథెంటికేషన్ హిస్టరీకి వెళ్లండి. మీ ఆధార్ కార్డు ఎప్పుడు ఎక్కడ ఉపయోగించారో తెలుస్తుంది. మీ ఆధార్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేసినట్లు మీరు భావిస్తే వెంటనే UIDAIకి ఫిర్యాదు చేయండి.

Next Story