- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లు కళకళ
by Kema Shiva Kumar |
దేశీయ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతోనే ప్రారంభం అయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) నేడు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే, అంటే ఉదయం 9.45 గంటల సమయానికి సెన్సెక్స్ (Sensex) 280 పాయింట్లు పెరిగి లాభాల్లో కొనసాగుతోంది. ఇక నిఫ్టీ (NIFTY) 95 పాయింట్ల వృద్ధిని నమోదు చేసి కీలక స్థాయిల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గడిచిన కొన్ని సెషన్లుగా ఒడిదుడుకులకు లోనైన సూచీలు, నేడు రికవరీ బాట పట్టడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపింది.
Next Story






