దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనం.. సెన్సెక్స్ 434 పాయింట్లు డౌన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-09 04:28:38  IST  )

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Indian Stock Market Indices) ఇవాళ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనం.. సెన్సెక్స్ 434 పాయింట్లు డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Indian Stock Market Indices) ఇవాళ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నిమిషాల సమయానికి సెన్సెక్స్ (Sensex) ఏకంగా 434 పాయింట్లు కోల్పోయి 84,668 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో నిఫ్టీ (NIFTY) 135 పాయింట్లు పడిపోయి 25,831 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న లాభాల బుకింగ్, విదేశీ పెట్టుబడిదారుల (FII) నిరంతర అమ్మకాలు, రూపాయి బలహీనత, అంతర్జాతీయ మార్కెట్లలోని అనిశ్చితి లాంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల పతనానికి ప్రధాన కారణాలని స్టాక్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు FIIలు రూ.11,000 కోట్లకు పైగా విక్రయించారు. రూపాయి డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయి రూ.84.38కు చేరింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఐటీ, మెటల్స్ సూచీలు 0.6 శాతం నుంచి 1.2 శాతం మధ్య నష్టపోతున్నాయి.

Next Story