- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.43 కోట్ల లాభాలను సాధించిన దొడ్లా డైరీ
పాల ఉత్పత్తిదారు దొడ్లా డైరీ లిమిటెడ్ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.43.60 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

X
హైదరాబాద్: పాల ఉత్పత్తిదారు దొడ్లా డైరీ లిమిటెడ్ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.43.60 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.39.45 కోట్లుగా ఉంది, అంటే దాదాపు 10.5 శాతం పెరిగింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న దాని ప్రకారం, క్రితం ఏడాది త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.695.32 కోట్లు కాగా, ఇప్పుడు అది 10.4 శాతం పెరిగి రూ.767.75 కోట్లకు చేరుకుంది. కొత్తగా మహారాష్ట్రలో రూ.15 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసేందుకు ఇటీవల కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4027.66 కోట్లుగా ఉంది.
Next Story






