Sainik School: ఈ స్కూల్ లో చదివితే మిలటరీలో ఉద్యోగం ఖాయం.. దేశంలోనే తొలి సైనిక్ స్కూల్ ఎక్కడుందో తెలుసా..?

by Vennela |

Sainik School: ఆర్మీలో చేరాలంటే దేశభక్తితో పాటు దేహదారుఢ్యం, అలాగే చురుకైన నడవడిక, అకాడమిక్ నాలెడ్జ్ బాగా ఉండాలి.

Sainik School: ఈ స్కూల్ లో చదివితే మిలటరీలో ఉద్యోగం ఖాయం.. దేశంలోనే తొలి సైనిక్ స్కూల్  ఎక్కడుందో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: Sainik School: ఆర్మీలో చేరాలంటే దేశభక్తితో పాటు దేహదారుఢ్యం, అలాగే చురుకైన నడవడిక, అకాడమిక్ నాలెడ్జ్ బాగా ఉండాలి. అప్పుడే సైన్యంలో చేరి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. మీరు సైన్యం లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు చిన్నప్పటినుంచే కెరియర్ ప్లాన్ చేసుకున్నట్లయితే, భారత సైన్యంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం లభిస్తుంది. అంతే కాదు దేశానికి సేవలు అందిస్తూనే, మీ కెరీర్ ను కూడా బిల్డ్ చేసుకోవచ్చు.

సైనిక్ స్కూల్ ద్వారా మీరు ఆర్మీలోకి వెళ్లడం ఒక సరైన మార్గంగా చెప్పవచ్చు. మన దేశంలోనే తొలి సైనిక్ స్కూలు 1962లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో కోరుకొండ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ స్కూలును కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్లో సీటు పొందాలంటే, ప్రవేశ పరీక్ష కూడా ఉంటుంది.

ఈ స్కూల్లో విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ పైన ఎక్కువగా దృష్టి సారిస్తారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరేందుకు శిక్షణ అందిస్తారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, డిఫెన్స్ కోర్సుల కోసం విద్యార్థులను ఫిజికల్ ఫిట్ నెస్ తో పాటు అకాడమిక్ స్థాయిలో కూడా శిక్షణ అందిస్తారు.

విద్యార్థులకు సామాన్య విద్యతో పాటు, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, పబ్లిక్ స్పీకింగ్ వంటి రంగాలలో వీరికి శిక్షణ అందిస్తారు. ఈ స్కూలులో చదివిన విద్యార్థులు ఆర్మీలో చేరేందుకు నిర్వహించే NDA, CDS,ఇతర రక్షణ రంగ పరీక్షలతో పాటు, సివిల్ సర్వీసెస్, పోలీస్, బ్యాంకింగ్, ప్రైవేట్ రంగాల్లో విద్యార్థులు ఉద్యోగాలు పొందేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉంటారు.

ఈ స్కూలులో ప్రవేశం కోసం విద్యార్థులు (AISSEE – All India Sainik School Entrance Exam) పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ స్కూలులో చేరేందుకు ఆరవ తరగతి, 9వ తరగతిలో అవకాశం కల్పిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్: https://exams.nta.ac.in/AISSEE/ ను క్లిక్ చేసి తెలుసుకోండి.

Next Story