- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Beer price: ఇదేం బాదుడు మావా.. బీరును కూడా వదలడం లేదుగా.. రేట్లు పేలిపోతున్నాయి..అసలు బీరు రేటు ఎంతో తెలుసా?
Beer price: ప్రస్తుతం తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరిగాయి.

దిశ, వెబ్ డెస్క్: Beer price: ప్రస్తుతం తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే జనం గగ్గోలు పెడుతుంటారు కానీ..మద్యం ధరలు పెరిగితే మాత్రం ఏమాత్రం పట్టించుకోరు. ఎందుకంటే మద్యం ధరలు ఎంత పెంచినా మందుబాబులు కొనేస్తుంటారు. అంతేకాదు మేము ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాము..మా వల్లే ప్రభుత్వ ఖజానా నిండుతుందని గర్వంగా చెబుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వీరి వాదనే నిజమే అనొచ్చు. ఏది ఏమైతేనేం ప్రభుత్వానికి డబ్బులు కావాలి..మందు బాబులకు కిక్ కావాలి.
అసలు విషయం ఏంటంటే మద్యం ప్రియులు ఎంతో ఇష్టపడే బీరు..దాని అసలు రేటు ఎంతుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా. వైన్ షాపుకు వెళ్లి..బీరు ఇవ్వు అన్నా అంటాం. వాడు దాని రేటు చెప్పగానే డబ్బులు పే చేస్తాం. కానీ బీరు అసలు రేటు ఎంత అనేది పట్టించుకోం. కానీ ఇప్పుడు తెలుసుకుందాం.
లిక్కర్ పై ప్రభుత్వాలు పన్నులు వేస్తున్నయన్న సంగతి తెలిసిందే. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ, సెస్ పేర్లతో సర్కార్ డబ్బులు వసూలు చేస్తోంది. ఒక బీరు కొనుగోలు చేస్తే అందులోదాదాపు 70 నుంచి 80శాతం ప్రభుత్వానికే పోతుంది. మద్యం తయారీ ఖర్చుకు, అమ్మే ఖర్చుకు చాలా వ్యత్యాసం ఉంది. ధరలు బీరు బ్రాండ్ బట్టి మారుతుంటాయి. మీరు తాగే బీర్ బ్రాండ్ 250 ఉంటే అందులో దాదాపు 180 రూపాయలు ప్రభుత్వ ఖజానాకే పోతుంది. దీన్ని బట్టి చూస్తే పన్ను చెల్లించక ముందు బీరు ధర కేవలం70 నుంచి 80 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ మనం మాత్రం దాన్ని 4 రెట్లు అధిక ధరలకు కొంటున్నాం. ఈ విషయం తాగేవారికి చెబితే...అస్సలు పట్టించుకోరు. ఎంత రేటు అయినా సరే కొనాల్సిందే..తాగాల్సిందే..కిక్కు ఎక్కాల్సిందే అంటారు.






