- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
70 ఏళ్ల వయసులో ఆనంద్ మహీంద్రా ఎలా ఫిట్‌గా ఉన్నాడో తెలుసా? ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.

దిశ, వెబ్ డెస్క్: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడూ ఎన్నో ఆసక్తికరమైన, ప్రేరణ కలిగించే విషయాలు, ఐడియాలజీలు, సామాజిక అంశాలపై అభిప్రాయాలు, సామాన్యుల విజయగాథలు.. అన్నింటినీ తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు. వ్యాపారంలో విజనర్‌గా నిలిచిన ఆనంద్ మహీంద్రా ఆరోగ్య పరంగా కూడా చాలామందికి ఆదర్శంగా ఉంటారు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన్ను చూస్తే సూపర్ ఫిట్‌గా కనిపిస్తారు. మరి ఆనంద్ మహీంద్రా యూత్‌లైక్ ఎనర్జీ వెనకున్న ఫిట్‌నెట్ (Fitness) రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా వారానికొకసారి తన ఫిట్‌నెస్ షెడ్యూల్‌ను మార్చుకుంటూ ఉంటారు. సాధారణంగా ఈత, ఎలిప్టికల్ (Swimming, elliptical) ట్రైనర్ వంటివి ఉపయోగించి కార్డియో వ్యాయామాలు (Cardio exercises) చేస్తారు. వారంలో కొన్ని రోజులు కండరాలకు బలాన్నిచ్చే బరువులు ఎత్తే వ్యాయామాలు చేస్తుంటారు. కానీ ఆయన తప్పకుండా ప్రతి రోజూ ధ్యానం చేస్తారని ఇంటర్య్వూలో తెలిపారు. ప్రతి ఉదయం కనీసం 20 నిమిషాలపాటు ధ్యానం చేయడం తనకు మానసిక స్పష్టత, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెబుతున్నారు. శరీరంతో పాటు మనసుకూ శాంతినివ్వగల ఈ ప్రాక్టీస్ వల్లే తాను ఈ వయసులోనూ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతున్నానంటారు.






