Chicken Gunya : చికెన్ గున్యా టీకాను వాడకండి : ఔషధ నియంత్రణ విభాగం వార్నింగ్

by Muthe.Rajitha |

చికెన్ గున్యా(Chicken Gunya)కు ఇచ్చే IXCHIQ టీకా(IXCHIQ Vaccine)ను వాడొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Chicken Gunya : చికెన్ గున్యా టీకాను వాడకండి : ఔషధ నియంత్రణ విభాగం వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : చికెన్ గున్యా(Chicken Gunya)కు ఇచ్చే IXCHIQ టీకా(IXCHIQ Vaccine)ను వాడొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. IXCHIQ అనేది చికెన్‌గున్యా వైరస్‌ను నివారించేందుకు ఉపయోగించే ముఖ్యమైన టీకా. ఇది ప్రపంచంలోనే చికెన్ గున్యాకు తొలి వాక్సిన్. ఈ టీకాతో ఇటీవల తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) 60 ఏళ్లు పైబడిన వారిని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా 80,000 మందికి ఈ టీకా ఇవ్వగా.. అందులో 60 - 89 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల్లో 17 తీవ్రమైన ఆరోగ్య సమస్యలు నమోదు కాగా అందులో ఇద్దరు మరణించారు.

వీరంతా తీవ్ర న్యూరోలాజికల్, కార్డియాక్ సంబంధిత సమస్యలు ఎదుర్కొనట్టు పేర్కొంది. దీంతో 60 ఏళ్లు పైబడిన వారు ఈ టీకాను వాడవద్దని FDA మరియు CDC సూచించాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ టీకాను వాడకూడదని తెలుపుతూ.. ఈ డ్రగ్ పై మరింత పరిశోధన జరుపుతున్నట్టు వెల్లడించింది.

Next Story