Hyundai Motor: దీపావళికి భారీ డిస్కౌంట్స్​ ప్రకటించిన హ్యుందాయ్

by S Gopi |

కంపెనీ తన పోర్ట్‌ఫోలియో ఎక్కువగా అమ్ముడయ్యే కార్లపై దీపావళి సందర్భంగా ఆఫర్స్ ప్రకటించింది.

Hyundai Motor: దీపావళికి భారీ డిస్కౌంట్స్​ ప్రకటించిన హ్యుందాయ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశవ్యాప్తంగా కార్ల ధరలు దిగొచ్చాయి. ఇప్పటికే అన్ని కంపెనీలు పన్ను రేట్లకు అనుగుణంగా ధరలు తగ్గించాయి. త్వరలో దీపావళి పండుగ నేపథ్యంలో ప్రముఖ తయారీ కంపెనీ హ్యూండాయ్ మోటార్స్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియో ఎక్కువగా అమ్ముడయ్యే కార్లపై దీపావళి సందర్భంగా ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ తన ఐ10 నియోస్ మోడల్‌పై అత్యధికంగా రూ. 55 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దాంతో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.47 లక్షలకు(ఎక్స్‌షోరూమ్) లభిస్తుంది. అలాగే, అవెన్యూ మోడల్‌పై గతంలో రూ. లక్షకు పైగా తగ్గింపు ప్రకటించిన కంపెనీ, పండుగ ఆఫర్ కింద మరో రూ. 50 వేలు తగ్గించింది. ప్రారంభ ధర రూ. 7.26 లక్షలుగా ఉంది. హ్యూండాయ్ ఆరా మోడల్‌పై రూ. 43 వేల వరకు తగ్గించడంతో రూ. 5.98 లక్షలకు లభిస్తుంది. హ్యూండాయ్ ఎక్స్‌టర్‌పై రూ. 45 వేలు తగ్గించింది. ఫలితంగా ప్రారంభ ధర రూ. 5.49 లక్షలుగా ఉంది. హ్యూండాయ్ పాపులర్ మోడల్ ఐ20పై రూ. 55 వేల డిస్కౌంట్ ఇవ్వడమో రూ. 6.87 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. హూండాయ్ అల్కాజర్ కారుపై రూ. 60 వేల రాయితీ ఇస్తోంది. ప్రారంభ ధర రూ. 14.47 లక్షలకు అందుబాటులో ఉంది.

Next Story