- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DGCA: అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశాలు
తనిఖీ అనంతరం నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అహ్మబాదాద్ విమాన ప్రమాద ఘటనలో 265 మంది మరణించిన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. వందలాది మంది చావుకు కారణమైన బోయింగ్ విమానాల భద్రతపై తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలంటూ ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశించింది. తనిఖీ అనంతరం నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ముందుజాగ్రత్త చర్యగా, జెనెక్స్ ఇంజిన్లతో కూడిన 8787-8/9 విమానాలపై సంబంధిత ప్రాంతీయ డీజీసీఏ కార్యాలయాలతో సమన్వయం ద్వారా తక్షణమే అదనపు నిర్వహణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. దీంతో ఎయిర్ఇండియా తక్షణం డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు మొదలుపెట్టింది. తమ వద్ద ఉన్న అన్ని బోయింగ్ విమానాలను ఆడిట్ చేయడం ప్రారంభించింది. 787 మోడళ్లలో విమానాల భద్రతా ప్రమాణాలను ప్రత్యేకంగా తనిఖీ చేయడమే కాకుండా, దానిపై సమగ్రమైన నివేదికను రూపొందిస్తోంది. ప్రస్తుతం ఎయిర్ఇండియా బోయింగ్‌కు చెదిన 787-8 సిరీస్‌లో 26, 787-9 సిరీస్‌లో ఏడు విమానాలను నడుపుతోంది. వీటన్నిటిని ఎయిర్ఇండియా రిపోర్టును రూపొందించి డీజీసీఏకు సమర్పిస్తుంది.
డీజీసీఏ తన ఉత్తర్వుల్లో, జూన్ 15వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత భారత్ నుంచి విమానం బయలుదేరే ముందు ఒకసారి తనిఖీ తప్పనిసరి అని ఆదేశించింది. దీంతో పాటు ఇంధన పారామీటర్ మానిటరింగ్, సంబంధిత సిస్టమ్‌ల తనిఖీ, క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్, అనుబంధ సిస్టమ్‌లను, ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్-సిస్టమ్ టెస్టింగ్, ఇంజిన్ ఫ్యూయల్ డ్రైవెన్ యాక్యుయేటర్-ఆపరేషనల్ టెస్ట్, ఆయిల్ సిస్టమ్, హైడ్రాలిక్ సిస్టమ్‌కు సంబంధించిన సర్వీస్‌బిలిటీ చెకింగ్, టేకాఫ్ పారామీటర్లను తనిఖీ చేయాలని వెల్లడించింది.






