- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IndiGo: ఇండిగోకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు
ఎయిర్‌లైన్ సంస్థ నుంచి వచ్చిన రికార్డులు, నివేదికలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం డీజీసీఏ అధికారులు తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: విమానాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తున్న డైరెక్టరైట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అందులో భాగంగా ఇండిగోకు తాజా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దాదాపు 1,700 మంది పైలట్లకు నిర్వహించిన సిమ్యులేటర్ శిక్షణలో లోపాలున్నాయని ఆరోపిస్తూ ఏవియేషన్ రెగ్యులేటర్ ఇండిగోకు ఈ నోటీసులు ఇచ్చింది. గత నెలలో ఎయిర్‌లైన్ సంస్థ నుంచి వచ్చిన రికార్డులు, నివేదికలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం డీజీసీఏ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇండిగో నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కమాండ్, ఫస్ట్ ఆఫీసర్ పైలట్‌లతో సహా దాదాపు 1,700 మంది పైలట్‌లకు కేటగిరీ సీ లేదా క్రిటికల్ ఎయిర్‌ఫీల్డ్ శిక్షణ అర్హత లేని సిమ్యులేటర్లతో నిర్వహించారని డీజీసీఏ కనుగొంది. పైలట్‌లు శిక్షణ పొందిన కాలికట్, లేహ్, ఖాట్మండు వంటి కొన్ని విమానాశ్రయాలలోని సిమ్యులేటర్లు కార్యకలాపాలకు అర్హత లేనివని కూడా డీజీసీఏ గుర్తించింది. టేబుల్ టాప్ రన్‌వే ఉన్న కాలికట్ లాంటి కొన్ని విమానాశ్రయాలు విమాన కార్యకలాపాల నిర్వహణకు అదనపు అవసరాలు కావాల్సి ఉందని పేర్కొంది.






