- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మకాలు తగ్గినా హైప్ పెరిగింది.. ఇండ్ల అమ్మకాల్లో 7% వృద్ధి!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇండ్ల విక్రయాల విలువ గత ఆర్థిక సంవత్సరం కంటే 19 శాతం అధికంగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఇండ్ల అమ్మకాలు అదరగొడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) అమ్ముడుపోయిన ఇండ్ల విలువ ఎంతో తెలుసా ? ఏకంగా రూ.2.98 లక్షల కోట్ల వరకు ఉంది. 2024 మొదటి ఆరు నెలల్లో రూ.2.79 లక్షల కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే గతేడాదితో పోలిస్తే 7 శాతం వృద్ధి కనిపించింది. అయితే యూనిట్ల పరంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది ఆరు నెలల్లో 2.27 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడేమో 1.93 లక్షల యూనిట్లు మాత్రమే రికార్డయ్యాయి. అంటే 15 శాతం మేర తగ్గుదల నమోదైంది. ఈ వివరాలను రియల్ ఎస్టే ట్ కన్సల్టెంట్ అనరాక్ తన తాజా నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద విక్రయాల విలువ గత ఆర్థిక సంవత్సరం కంటే 19 శాతం అధికంగా రూ.6.65 లక్షల కోట్లుగా ఉండొచ్చని అనరాక్ ఈడీ ప్రశాంత్ ఠాకూర్ అంచనా వేశారు. 2024-25లో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు 4,22,765 యూనిట్లు కాగా, వీటి విలువ రూ.5.59 లక్షల కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. 2023-24లో అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరిన అనంతరం ఎన్నో ప్రతికూలతల మధ్య ఆ తర్వాత కొంత నెమ్మదించినట్టు తెలిపారు. ధరల పెరుగుదలే ప్రస్తుతం ఇండ్ల అమ్మకాలు అధికంగా నమోదు కావడానికి కారణమని నివేదిక పేర్కొంది. దాంతో పాటు ప్రీమియం అపార్ట్ మెంట్ల అమ్మకాలు మాత్రం మెరుగ్గా కనిపిస్తున్నది.






