Saving Scheme: భార్య పేరుమీద డిపాజిట్‌ చేయండి.. ఎంత లాభమో తెలుసుకోండి

by Vennela |
Saving Scheme: భార్య పేరుమీద డిపాజిట్‌ చేయండి.. ఎంత లాభమో తెలుసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్ : Mahila Samman Savings Certificate: మనం సంపాదించిన(Saving Scheme) డబ్బును దాచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులోనూ అనేక రకాల స్కీములూ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సేవింగ్ స్కీమ్స్(Savings Schemes)ఎన్నో అందిస్తోంది. వీటిల్లో డబ్బులు దాచుకుంటే ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి పొందవచ్చు. అందులో ఒకటి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్(Mahila Samman Savings Certificate).

ఇందులో మీ భార్య పేరు మీద పొదుపు చేస్తే మంచి రిటర్న్స్(Good returns) పొందవచ్చు. ఈ స్కీమును కేంద్రంలోని మోదీ(pm modi) సర్కార్ 2023లో ప్రారంభించింది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భారీ వడ్డీని కూడా పొందవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్(Mahila Samman Savings Certificate) స్కీముపై 7.5శాతం వడ్డీని అందిస్తారు. ఈ స్కీము కింద కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 2లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీము రెండేళ్లలో మెచ్యూర్ అవుతుంది. అయితే మీరు అకౌంట్ తీసుకున్న తేదీ నుంచి ఏడాది తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్ లో 40శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీము కింద మీరు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసు(Post office)లో మీ భార్య పేరు మీద మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్(Mahila Samman Savings Certificate) ఖాతాను తీసుకోవచ్చు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీము(Mahila Samman Savings Certificate) కింద మీరు రూ. 2లక్షల కంటే ఎక్కువగా డిపాజిట్ చేయలేరు. ఒక వేళ రూ. 2లక్షలు డిపాజిట్ చేసినట్లయితే ఈ మొత్తంపై మీకు 7.5శాతం వడ్డీ కూడా లభిస్తుంది. దీని ప్రకారం మెచ్చూరిటీపై మొత్తం రూ. 2,32,044.00పొందుతారు. అంటే రూ. 2లక్షల డిపాజిట్ పై రూ. 32, 044 వడ్డీని పొందుతారు.

అయితే మీకు ఇంకా పెళ్లి కానట్లయితే మీరు మీ తల్లి పేరు మీద కూడా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీము(Mahila Samman Savings Certificate)లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు..మీకు కూతురు ఉంటే ఆమె పేరు మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed