- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran: ఇరాన్ అల్లర్లలో 3117 మంది మరణాలు
ఇరాన్‌లోని తమ యాక్టివిస్టుల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించామని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: గత నెల ఇరాన్‌లో జరిగిన దేశవ్యాప్త అల్లర్లలో మరణించిన వారి సంఖ్య కనీసం 7,002 మందికి చేరుకుందని గురువారం అమెరికాకు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ చెబుతోంది. వాస్తవంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఇరాన్‌లోని తమ యాక్టివిస్టుల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించామని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక టీవీ ఛానెళ్లు ఇదివరకు 3,117 మంది మరణించారని తెలిపింది. అయితే, గతంలోనూ నిరసనల సమయంలో తక్కువ మరణాలను చూపించినట్లు ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి. వార్తా సంస్థలు దేశంలో స్వేచ్ఛగా సమాచారాన్ని చేరవేసేందుకు అనుమతి లేనందున ఖచ్చితమైన సంఖ్యలను ఇవ్వడం సాధ్యపడటంలేదని యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. అసోసియేటెడ్ ప్రెస్ వంటి వార్తా సంస్థలు ఇరాన్‌లో ఇంటర్నెట్, ఫోన్ యాక్సెస్‌ను పరిమితం చేస్తున్నాయని తెలిపింది. మరోవైపు, అమెరికాతో ఇరాన్ అణు చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నదని తెలుస్తోంది. ఇరాన్ అధికారి అలీ లారిజాని ఇటీవల ఖతార్, ఒమన్ నేతలను కలిశారు. అమెరికా నుంచి స్పష్టమైన ఆఫర్ లేనప్పటికీ, ఇరుపక్షాలు చర్చలను కొనసాగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.






