ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణలో బిడ్ల సమర్పణ గడువు పొడిగించే అవకాశం!

by Disha Web Desk 6 |
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణలో బిడ్ల సమర్పణ గడువు పొడిగించే అవకాశం!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ కోసం ప్రాథమిక బిడ్లను సమర్పించే గడువును ఒక నెల రోజులు పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ప్రైవేటీకరణకు సంబంధించి బిడ్లు సమర్పించేందుకు గడువు ఈ నెల 16తో ముగియనున్న నేపథ్యంలో జనవరి మొదటి అర్ధభాగానికి పొడిగించవచ్చని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంకులో మొత్తం 94.71 శాతం వటా ఉంది. అందులో 60.72 శాతం విక్రయించేందుకు ఈ ఏడాది అక్టోబర్ 7న ప్రభుత్వం ఆసక్తి వ్యవక్తీకరణ బిడ్లను ఆహ్వానించగా, డిసెంబర్ 16న తుది గడువుగా నిర్ణయించింది. సహజంగా ఏడాది చివర్లో సెలవుల కారణంగా విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు పనిచేయవు.

ఇప్పటికే గడువు పొడిగించాలనే అభ్యర్థనలు వచ్చిందున, దీనికి సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని అధికారి వివరించారు. కాగా, ఇటీవలే ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ(51 శాతం) వాటా కలిగి ఉండేందుకు పెట్టుబడుల సంస్థలు, విదేశీ ఫండ్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. సాధారణంగా ఆర్‌బీఐ నిబంధనల ప్రకార, కొత్త ప్రైవేట్ బ్యాంకులో విదేశీ సంస్థలకు మెజారిటీ వాటాకు అవకాశం ఉండదు. కానీ ఐడీబీఐ బ్యాంకులో ఇదివరకే కార్యకలాపాలను నిర్వహిస్తున్న కారణంగా ఆర్‌బీఐ నిబంధన అఈడీబీఐ బ్యాంకుకు వర్తించదని దీపమ్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

ఎఫ్‌డీల వడ్డీ రేట్లు పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్!


Next Story