De Beers: భారత మార్కెట్లోకి గ్లోబల్ డైమండ్ బ్రాండ్ 'డి బీర్స్' ఎంట్రీ

by S Gopi |

ఈ ఏడాది ఆఖరు నాటికి దేశీయంగా 15 స్టోర్లను ప్రారంభించనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటనలో తెలిపింది.

De Beers: భారత మార్కెట్లోకి గ్లోబల్ డైమండ్ బ్రాండ్ డి బీర్స్ ఎంట్రీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: వజ్రాల పరిశ్రమలో అంతర్జాతీయ బ్రాండ్ డీ బీర్స్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. రిటైల్ అమ్మకాల విభాగంలోకి అడుగుపెడుతూ ఈ ఏడాది ఆఖరు నాటికి దేశీయంగా 15 స్టోర్లను ప్రారంభించనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటనలో తెలిపింది. ఫరెవర్ జ్యువెలరీ బ్రాండ్ ద్వారా రిటైల్ విభాగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని డి బీర్స్ ఇండియా ఎండీ అమిత్ ప్రతిహారి చెప్పారు. ఈ ఏడాది ఢిల్లీలో ఎనిమిది, మిగిలిన స్టోర్లను ముంబైలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో 2030 నాటికి 100 రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి ద్వారా రూ. 870 కోట్ల వరకు ఆదాయం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు అమిత్ వివరించారు. మొదటి రిటైల్ స్టోర్ జూన్-జూలై కల్లా ప్రారంభం కానుండగా, వీటి కోసం కంపెనీ ఎంత మేరకు పెట్టుబడులు పెట్టనుందనే వివరాలను వెల్లడించలేదు.

Next Story