- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG BREAKING: నాలుగేళ్ల గరిష్ఠానికి క్రూడ్ ఆయిల్ ధర.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. ఫలితంగా ఆసియా స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు నమోదయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం క్రూడ్ ఆయిల్ ధరలపై భారీగా పడింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 27 శాతం ముడిచమురు ధర పెరగడంతో.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో భారీ కుదుపులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 100 డాలర్ల మార్కును దాటి 101.19 డాలర్లకు చేరుకోగా.. కొద్దిసేపటికే ధర 115 డాలర్లకు జంప్ అయింది. గతవారం ధరతో పోలిస్తే.. 20 శాతం అధికం. అమెరికా చమురు రేట్లకు బెంచ్ మార్కుగా ఉన్న వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 106.22 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నాలుగేళ్లలో తొలిసారి క్రూడ్ ఆయిల్ ధర ఈ స్థాయిలో పెరగడంతో.. దానిప్రభావం అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. క్రూడ్ ఆయిల్ సృష్టించిన ప్రకంపనలతో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సౌత్ కొరియా, జపాన్, తైవాన్, ఆస్ట్రేలియా, చైనా స్టాక్ మార్కెట్లు ఊహించని రీతిలో పతనమయ్యాయి.
జపాన్ సూచీ నిక్కీ 7 శాతం పతనమవ్వగా.. డౌఫ్యూచర్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. భారీ నష్టాల నేపథ్యంలో సౌత్ కొరియాలో ట్రేడింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఇటు భారత్ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టాలను చవిచూసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. కాగా.. క్రూడ్ ఆయిర్ ధర పెరుగుదల తాత్కాలికమేనని, ఇరాన్ అణు ముప్పును తొలగిస్తే ధరలు తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు.






