- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Croma: ఇయర్ ఎండ్ సేల్.. రూ. 40,990కే ఐఫోన్ 16
ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా 'క్రోమ్‌టాస్టిక్ డిసెంబర్ సేల్ ' పేరుతో భారీ డిస్కౌంట్లు తీసుకొచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: మరో రెండు వారాల్లో ఏడాది ముగియనుంది. ఇంకో వారం రోజుల్లో క్రిస్మస్ పండుగ రానుంది. ఈ నేపథ్యంలో టాటా యాజమాన్యంలోని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ క్రోమా భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా 'క్రోమ్‌టాస్టిక్ డిసెంబర్ సేల్ ' పేరుతో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు భారీ డిస్కౌంట్లు తీసుకొచ్చింది. ఈ సేల్ డిసెంబర్ 15 నుంచి మొదలై 2026, జనవరి 4 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా క్రోమా ఐఫోన్, ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు, ఎం4 చిప్‌తో కూడిన యాపిల్ సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌తో సహా అనేక పరికరాలపై తగ్గింపు ధరలను అందిస్తోంది. ఐఫోన్ 16 రూ.40,990కే లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈఎంఐ రూ.1,833 నుంచే మొదలవుతుంది. ఐఫోన్ 15 కూడా రూ. 36,490కే కొనుగోలు చేయవచ్చు, ఈ ఫోన్ కోసం ఈఎంఐ రూ. 1,604 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, ఈ తగ్గింపు ధరలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, క్యాష్‌బ్యాక్ అమలు తర్వాత వర్తిస్తాయని క్రోమా స్పష్టం చేసింది. అలాగే, ఇవి ప్రాంతం, స్టోర్, లభ్యతను బట్టి మారవచ్చని పేర్కొంది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లపైనా భారీ రాయితీలను క్రోమా ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా రూ. 69,999కే అందుబాటులో ఉంది, ప్రీమియం శాంసంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ 7 కూడా రూ. 99,999కే లభిస్తుంది. ఈ సీజన్‌లో ల్యాప్‌టాప్ డీల్స్ మరొక ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ఎం4 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ చాలా తక్కువ రూ. 55,911 ధరకు అందుబాటులో ఉంది. ఇవి మాత్రమే కాకుండా టీవీలు, గృహోపకరణాలపైనా అధిక తగ్గింపు ఇస్తున్నట్టు క్రోమా పేర్కొంది.






