Reliance Jio: జియో యూజర్లకు క్రేజీ న్యూస్.. కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ అదిరిపోయిందిగా!

by Yella Dhawani Reddy |

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జియో (Jio), డిస్నీ హాట్‌స్టార్ (Disney Hotstar) విలీనమై 'జియో హాట్‌స్టార్'గా (Jio Disney Hotstar) మారిన సంగతి తెలిసిందే.

Reliance Jio: జియో యూజర్లకు క్రేజీ న్యూస్.. కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ అదిరిపోయిందిగా!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జియో (Jio), డిస్నీ హాట్‌స్టార్ (Disney Hotstar) విలీనమై 'జియో హాట్‌స్టార్'గా (Jio Disney Hotstar) మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్లాన్‌లను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో రిలయన్స్ జియో మొబైల్ నెట్‌వర్క్ యూజర్లకు మరో క్రేజీ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లు కేవలం రూ.100లతో రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల పాటు జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా పొందవచ్చు.

రీఛార్జ్‌ ప్లాన్‌ బెనిఫిట్స్‌

కేవలం రూ.100 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 90 రోజుల వ్యాలిడిటీతో 5GB డేటాతో పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. మొబైల్‌తో పాటు టీవీలోనూ జియోహాట్‌స్టార్ సేవలను పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్ ద్వారా కాల్స్, SMS వంటి సౌకర్యాలు పొందలేరు. కాగా, జియో హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ నెల రోజులకు గానూ రూ.149లుగా ఉంది. ప్రీమియం ప్లాన్ కావాలనుకునే వారు నెలకు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 1,499 చెల్లించాలి.

అలాగే, IPL సీజన్ మొదలవుతున్న క్రమంలో క్రికెట్ అభిమానుల కోసం మరో ప్రత్యేక క్రికెట్ డేటా ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది. రూ.195తో రీఛార్జ్ చేసుకుంటే.. మొత్తం 15GB డేటా లభిస్తుంది. 90 రోజుల జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే ఇందులో కూడా కేవలం డేటా బెనిఫిట్స్ ఉంటాయి.

Next Story