Economy: వినియోగమే భారత వృద్ధికి అతిపెద్ద చోదక శక్తి: ఎస్అండ్‌పీ గ్లోబల్

by S Gopi |

ఈ మార్పులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా వచ్చే 2026-27లోనూ వినియోగం పెరిగేందుకు, వృద్ధికి మద్దతిచ్చే అవకాశం ఉంది

Economy: వినియోగమే భారత వృద్ధికి అతిపెద్ద చోదక శక్తి: ఎస్అండ్‌పీ గ్లోబల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు, ఆదాయ పన్ను కోత, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి పరిణామాలు దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధికి దోహదపడతాయని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్‌పీ గ్లోబల్ అభిప్రాయపడింది. దీనివల్ల ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులతో పోలిస్తే వినియోగం కీలక చోదకంగా నిలుస్తుందని సోమవారం ప్రకటనలో ఎస్అండ్‌పీ గ్లోబల్ పేర్కొంది. తగ్గించిన జీఎస్టీ రేట్లు మధ్యతరగతి నుంచి వినియోగానికి మద్దతిస్తాయి. ఈ మార్పులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా వచ్చే 2026-27లోనూ వినియోగం పెరిగేందుకు, వృద్ధికి మద్దతిచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత వృద్ధి అంచనాలను 2025-26లో 6.5 శాతం, 2026-27కి సంబంధించి 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ఎస్అండ్‌పీ గ్లోబల్ తెలిపింది. అధిక అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు ఉన్నప్పటికీ, భారత్‌లో స్థానిక గిరాకీ బలంగా ఉంది. భారతీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలను తగ్గించే సంకేతాలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

Next Story