- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PF Withdrawal: ATMకి వెళ్లద్దు.. 2 నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఇలా విత్ డ్రా చేయండి..!
PF Withdrawal: మీరు మీ పీఎఫ్(PF) డబ్బులు విత్ డ్రా చేయాలనుకుంటున్నారా?

దిశ, వెబ్‌డెస్క్: PF Withdrawal: మీరు మీ పీఎఫ్(PF) డబ్బులు విత్ డ్రా చేయాలనుకుంటున్నారా? అయితే డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇలా విత్ డ్రా చేసుకోవచ్చు. కేవలం రెండు నిమిషాల్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ (Umang)యాప్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా(PF Withdrawal) చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ నిర్వహిస్తాయి. దీని ముఖ్య లక్ష్యం పౌరులకు 1,200కిపైగా సేవలను అందించడం. పీఎఫ్ విత్ డ్రా(PF Withdrawal) చేయడం, పీఎఫ్ బ్యాలెన్స్ చెక్(PF balance check) చేయడం వంటి సేవలను ఎలాంటి కాగిత పత్రాలు అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
ఉమంగ్ యాప్(Umang App) లో పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు మీకు అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోవాలి. ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసేందుకు కొన్ని అర్హతలు కూడా ఉండాలి. ఆధార్(Aadhar), యూఏఎన్ లింక్ (UAN link)మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)ఆధార్ తో లింక్ చేయాలి. కేవైసీ వివరాలు ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వంటి కేవైసీ(KYC) వివరాలు అప్ డేట్ చేసి ఈపీఎఫ్ఓ పోర్టల్ వెరిఫై చేసుకోవాలి. ఉద్యోగ స్టేటస్ కూడా చూడాలి. ఉద్యోగం కోల్పోయిన వారు, రిటైర్మెంట్, వైద్య అవసరాలు, విద్య లేదా ఇల్లు కొనుగోలు కోసం పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు.
ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేయడానికి ఉమంగ్ యాప్(Umang App) ను గూగుల్ ప్లే స్టోర్(Google play store) లేదా యాపిల్ యాప్ స్టోర్(Apple app store) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాప్ లో రిజిస్టర్ చేసి తర్వాత లాగిన్ అవ్వాలి. రిజిస్టర్డ్ నెంబర్ కు ఓటీపీ కూడా వస్తుంది. దాన్ని మీరు వెరిఫై చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
యాప్ హోంపేజీలో ఈపీఎఫ్ఓ(EPFO) సెక్షన్ ను ఓపెన్ చేయాలి. ఎంప్లాయి సెంట్రిక్ సర్వీసెస్ ఆప్షన్ సెలక్ట్ చేసి రేజ్ క్లెయిమ్ పై క్లిక్ చేయాలి. యూఏఎన్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయాలి. క్లెయిమ్ ఫారం ఫిల్ చేసి మొత్తం పీఎఫ్ అమౌంట్(PF amount) లేదా కొంత భాగం విత్ డ్రా కావాలా అనేది కన్ఫర్మ్ చేయాలి. డీటెయిల్స్ నింపి, పీఎఫ్ విత్ డ్రా చేయడానికి కారణం చెప్పాలి. అవసరమైనప్పుడు వైద్య సర్టిఫికేట్ లేదా విద్య సంబంధిత ప్రూఫ్ జత చేయాలి. క్లెయిమ్ సమర్పించిన తర్వాత ట్రాక్ క్లెయిమ్ సెక్షన్ ద్వారా దాని స్టేటస్ చెక్ చేయాలి.
ఇలా మీరు ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా(PF Withdrawal) చేయడం చాలా ఈజీ. ఆలస్యం లేకుండా మీకు అవసరమైన డబ్బును పొందవచ్చు. అవసరమైన వివరాలు అప్ డేట్ చేయడం తప్పనిసరని గుర్తుంచుకోవాలి. అలాగే వైద్య, విద్య అవసరాల కోసం పీఎఫ్ విత్ డ్రా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.






