- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాట్‌జీపీటీలోనూ వాణిజ్య ప్రకటనలు!
by Muthe.Rajitha |
చాట్‌జీపీటీలో వాణిజ్య ప్రకటనలను ప్రవేశపెట్టేందుకు ఓపెన్‌ఏఐ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్ : చాట్‌జీపీటీలో వాణిజ్య ప్రకటనలను ప్రవేశపెట్టేందుకు ఓపెన్‌ఏఐ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘ది ఇన్ఫర్మేషన్’ కథనం ప్రకారం.. ప్రస్తుతం ప్రకటనలు లేని చాట్‌జీపీటీ, భవిష్యత్తులో యాడ్స్ ప్రవేశపెట్టడం ద్వారా ఆదాయం పొందే మార్గాలను పరిశీలిస్తోందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో చాట్‌బాట్ ఇంటర్‌ఫేజ్‌లో మార్పులు చేయాల్సి రావచ్చని, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ప్రకటనలను ఎలా చూపించాలన్న దానిపై ఓపెన్‌ఏఐలో అంతర్గత చర్చలు మొదలైనట్లు సమాచారం. ఫ్రీ యూజర్లకు ప్రకటనలు చూపించి, డబ్బులు చెల్లించే వినియోగదారులకు యాడ్-ఫ్రీ అనుభవం కొనసాగించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Next Story






