- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cognizant: ఉద్యోగులకు వేతనాల పెంపు ప్రకటించిన కాగ్నిజెంట్
ఈ పెరుగుదల సీనియర్ అసోసియేట్ స్థాయిల వరకు ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. అర్హత కలిగిన ఉద్యోగులలో దాదాపు 80 శాతం మందికి నవంబర్ 1 నుంచి జీతాల పెంపు అమలవుతుందని కంపెనీ తెలిపింది. కంపెనీ తన రెండో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో మెజారిటీ ఉద్యోగులకు మెరిట్ ఆధారంగా జీతాల పెంపు ఇవ్వాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. ఈ పెరుగుదల సీనియర్ అసోసియేట్ స్థాయిల వరకు ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుంది. ఎంత మొత్తం పెంచుతారనే దానిపై స్పష్టత ఇవ్వనప్పటికీ, ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు రేటింగ్‌ని బట్టి ఉంటుందని కాగ్నిజెంట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. దేశీయంగా కంపెనీలో స్థిరంగా కొనసాగుతూ, అత్యధిక పనితీరు కనబరిచిన వారికి ఈ పెంపు అధిక సింగిల్ డిజిట్లలో అంటే 7-9 శాతం మధ్య ఉంటుందని అన్నారు. అత్యుత్తమ పనితీరు ఉన్నవారికి అత్యధిక పెంపు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ తన అసోసియేట్లకు భారీ బోనస్‌లను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా తన ఉద్యోగుల్లో 80 శాతం మందికి జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించింది.






