- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాఫీ హౌస్ దిగ్గజం ‘స్టార్‌బక్స్’ కీలక నిర్ణయం.. సంస్థ CTOగా ఆనంద్ వరదరాజన్ నిమాయకం
ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ హౌస్ చైన్ దిగ్గజం ‘స్టార్‌బక్స్’ (Starbucks) కీలక నిర్ణయం తీసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ హౌస్ చైన్ దిగ్గజం ‘స్టార్‌బక్స్’ (Starbucks) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా భారత సంతతి వ్యక్తి ఆనంద్ వరదరాజన్ (Anand Varadarajan)ను నియమించారు. 2026 జనవరి 19 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. ఆనంద్ స్టార్‌బక్స్ సీఈవో బ్రియాన్ నిక్కొల్ (Brian Nichol)కు రిపోర్టు చేసి కంపెనీ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్‌లో చేరనున్నారు.
కాగా, అమెజాన్‌లో దాదాపు 19 సంవత్సరాలు పనిచేసిన ఆనంద్ వరదరాజన్, ఇటీవల అమెజాన్ (Amazon) ప్రపంచవ్యాప్త గ్రోసరీ స్టోర్స్ వ్యాపారంలో టెక్నాలజీ, సప్లై చైన్ ఆపరేషన్స్‌ను పర్యవేక్షించాడు. అంతకు ముందు ఆరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, మోటరోలా, ఓపెన్‌వేవ్ వంటి స్టార్టప్ కంపెనీలలో కూడా పనిచేశారు. అతడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుంచి అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్, ఆ తర్వాత వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాడు. భారత సంతతికి చెందిన ఆనంద్ వరదరాజన్ స్కేలబుల్ సిస్టమ్స్, సప్లై చైన్ టెక్నాలజీ, కస్టమర్-ఫోకస్డ్ ఇన్నోవేషన్స్‌లో నిపుణుడిగా పేరుగాంచాడు.






