- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Coca-Cola: అమెరికా స్పోర్ట్స్ డ్రింక్ బ్రాండ్‌ను భారత్‌కు తీసుకొస్తున్న కోకాకోలా
అమెరికా మార్కెట్లో ఐదో పాపులర్ బ్రాండ్‌గా , స్పోర్ట్స్ డ్రింక్ విభాగంలో బిలియన్ డాలర్ల మార్కెట్‌ను కలిగి ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బేవరేజెస్ కంపెనీ కోకాకోలా భారత మార్కెట్‌కు అమెరికాకు చెందిన స్పోర్ట్స్ డ్రింక్ బ్రాండ్ బాడీఆర్మర్ లైట్‌ను పరిచయం చేయనుంది. ఈ వేసవి సందర్భంగా ఈ కూల్‌డ్రింక్‌ను తీసుకురానున్నట్టు గురువారం ప్రకటనలో వెల్లడించింది. బాడీఆర్మర్ లైట్ డ్రింక్ ఎలక్ట్రోలైట్స్, కొబ్బరినీళ్లతో కూడినది. అమెరికా మార్కెట్లో ఐదో పాపులర్ బ్రాండ్‌గా కొనసాగుతోంది. అంతేకాకుండా స్పోర్ట్స్ డ్రింక్ విభాగంలో బిలియన్ డాలర్ల మార్కెట్‌ను కలిగి ఉంది. దీంతో పాటు హానెస్ట్ టీ, విటమిన్ వాటర్ లాంటి మరో రెండు బ్రాండ్లను కూడా విడుదల చేస్తామని కోకాకోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా వైస్-ప్రెసిడెంట్ సందీప్ బజోరియా చెప్పారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో విటమిన్ వాటర్‌ను విక్రయిస్తున్నామని, త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఇటీవల దేశీయ రిలయన్స్ సంస్థ కాంపా కోలాతో కూల్‌డ్రింక్ మార్కెట్లో వ్యాపారాన్ని వేగవంతం చేయడం మొదలుపెట్టింది. తాజాగా స్పోర్ట్స్ డ్రింక్ విభాగంలో స్పిన్నర్ పేరుతో కొత్త బ్రాండ్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోకాకోలా అమెరికా నుంచి మరొక బ్రాండ్‌ను ప్రవేశపెట్టనుండటంతో కంపెనీల మధ్య పోటీ మరింత తీవ్రతరం కానుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై స్పందించిన సందీప్ బజోరియా, కూల్‌డ్రింక్స్ మార్కెట్లో పోటీని స్వాగతిస్తున్నామని అన్నారు. పోటీ ఉండటం వల్ల మార్కెట్లో కొత్త ఉత్పత్తులను కస్టమర్లకు అందించడం వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.






