- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Coca-Cola: భారత్‌లో కోకా-కోలా భారీ ఐపీఓ
వచ్చే వారం లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల ప్రజెంటేషన్లు జరగనున్నాయి. ఈ ప్రక్రియను కోకా-కోలాకు సలహాదారుగా ఉన్న రాత్‌స్‌ఛైల్డ్ అండ్ కో సమన్వయం చేయనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ కూల్‌డ్రింక్స్ బ్రాండ్ దిగ్గజం కోకా-కోలా తన భారతీయ బాట్లింగ్ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ)ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రతిపాదిత ఐపీఓ కోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల ఎంపికను కంపెనీ ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఇష్యూ ద్వారా సుమారు 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9,500 కోట్లు) సమీకరించాలని, కంపెనీకి 10 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల ప్రజెంటేషన్లు జరగనున్నాయి. ఈ ప్రక్రియను కోకా-కోలాకు సలహాదారుగా ఉన్న రాత్‌స్‌ఛైల్డ్ అండ్ కో సమన్వయం చేయనుంది. అయితే ఐపీఓ సమయం, పరిమాణం, విలువ, నిర్మాణం వంటి అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.
ఈ లిస్టింగ్ ముందుకు సాగితే, భారత మూలధన మార్కెట్ల ద్వారా నిధులు సమీకరిస్తున్న ఎంఎన్‌సీ కంపెనీల జాబితాలో కోకా-కోలా కూడా చేరుతుంది. గతేడాది ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిస్టింగ్, అంతకుముందు హ్యుండాయ్ మోటార్ ఇండియా ఐపీఓ విజయవంతమైన నేపథ్యంలో అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్‌పై మరింత ఆసక్తి చూపుతున్నాయి. దేశంలోని అతిపెద్ద శీతల పానీయాల బాట్లర్లలో ఒకటైన హెచ్‌సీసీబీ ప్రస్తుతం 17 లక్షలకు పైగా రిటైల్ అవుట్‌లెట్లు, 12 రాష్ట్రాల్లో 14 తయారీ ప్లాంట్లు, 236 జిల్లాలకు పంపిణీ నెట్‌వర్క్, 5,000 మందికిపైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.






