రూ.13 వేల కోట్లు విరాళంగా ఇచ్చేసిన బిలియనీర్.. ఎందుకంటే?

by Naga Rani Yarlagadda |

యాడ్-టెక్ కంపెనీ అయిన యాప్ నెక్సస్ (AppNexus) కో ఫౌండర్, మాజీ సీఈఓ అయిన బ్రియాన్ ఓ కెల్లీ (Brian O'Kelley) తన సంపాదనలో అధిక భాగాన్ని విరాళంగా ప్రకటించారు.

రూ.13 వేల కోట్లు విరాళంగా ఇచ్చేసిన బిలియనీర్.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: యాడ్-టెక్ కంపెనీ అయిన యాప్ నెక్సస్ (AppNexus) కో ఫౌండర్, మాజీ సీఈఓ అయిన బ్రియాన్ ఓ కెల్లీ (Brian O'Kelley) తన సంపాదనలో అధిక భాగాన్ని విరాళంగా ప్రకటించారు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ చెప్పిన వివరాల ప్రకారం.. 2018లో తన కంపెనీని అమ్మడం ద్వారా 1.6 బిలియన్ డాలర్ల సంపాదన వచ్చింది. అందులో ఎక్కువ భాగాన్ని AT&T అనే సంస్థకు ఇచ్చారు. యాప్ నెక్సస్ లో 10 శాతం వాటాను కలిగి ఉన్న బ్రియాన్ ఓ కెల్లీ తన కుటుంబం కోసం 100 మిలియన్ డాలర్ల కంటే సంపాదన ఉంచుకున్నట్లు తెలిపారు. తన భార్యతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కుటుంబ అవసరాలకు ఎంత డబ్బు కావాలో తన సలహా మేరకే నిర్ణయం తీసుకున్నామన్నారు.

మన అవసరాలకు మించిన సంపద మనల్ని ప్రజల నుంచి, సమాజం నుంచి దూరం చేస్తుందని, బాధ్యతా రాహిత్యమైన ఖర్చులకు కూడా దారి తీస్తుందని తెలిపారు. అందుకే బిలియనీర్ గా ఉండటం తనకు ఇష్టం ఉండదని, బిలియనీర్ల లైఫ్ స్టైల్ ను తాను అనుసరించాలని ఎన్నడూ అనుకోనని స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త స్టార్టప్ పెటటే యోచనా ఉన్నా.. బిలియనీర్ గా స్థిరపడాలన్న ఆలోచన మాత్రం తనకు లేదన్నారు. తన పిల్లలకు కూడా విలాసవంతమైన జీవితం ఇవ్వాలనుకోవడం లేదని, పరిమితులు తెలుసుకుని, విలువలతో కూడిన జీవితాన్నే వారు అనుభవించాలని ఆశిస్తున్నట్లు బ్రియాన్ ఓ కెల్లీ స్పష్టం చేశారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. తన సంపాదనలో 13 వేల కోట్లను విరాళంగా ఇవ్వడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Next Story