Cleartrip: రైల్వే టికెటింగ్ సేవల్లోకి క్లియర్‌ట్రిప్

by S Gopi |

రైల్వే టికెట్ బుకింగ్ సేవల కోసం కంపెనీ ఐఆర్‌సీటీసీతో సోమవారం కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Cleartrip: రైల్వే టికెటింగ్ సేవల్లోకి క్లియర్‌ట్రిప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ట్రావెల్ ప్లాట్‌ఫామ్ క్లియర్‌ట్రిప్ కొత్త సేవలను ప్రారంభించింది. రైల్వే టికెట్ బుకింగ్ సేవల కోసం కంపెనీ ఐఆర్‌సీటీసీతో సోమవారం కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా క్లియర్‌ట్రిప్ నుంచి యూజర్లు జనరల్, తత్కాల్ కోటా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సీట్ అవైలబిలిటీ, టికెట్ ధరల వివరాలు, పీఎన్ఆర్ స్టేటస్ ట్రాకింగ్, డిజిటల్ పేమెంట్స్, బెర్త్ ప్రిఫరెన్స్ సేవలు కూడా ఉంటాయని కంపెనీ వివరించింది. ప్రతి సంవత్సరం 80 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రిజర్వ్ టికెట్ల ద్వారా రైలులో ప్రయాణిస్తున్నారు. ఈ అవకాశం అందిపుచ్చుకుని, ఏడాది ఆఖరు నాటికి రైల్వే టికెట్ విభాగంలో సింగిల్-డిజిట్ మార్కెట్ వాటా లక్ష్యం రూపొందించామని క్లియర్‌ట్రిప్ ఎయిర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గౌరవ్ పట్వారీ వెల్లడించారు.

Next Story