CIBIL: బ్యాంకు రుణాలకు సిబిల్ స్కోరు తప్పనిసరి కాదు: కేంద్రం స్పష్టత

by S Gopi |   (  Updated:2025-08-24 12:44:22  IST  )

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ లోక్‌సభ సమావేశాల్లో ఈ విషయాన్ని ధృవీకరించారు.

CIBIL: బ్యాంకు రుణాలకు సిబిల్ స్కోరు తప్పనిసరి కాదు: కేంద్రం స్పష్టత
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకు రుణాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. మొదటిసారి రుణం తీసుకునే బ్యాంకు రుణాలకు కనీస సిబిల్ స్కోరు అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ లోక్‌సభ సమావేశాల్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. మొదటిసారి దరఖాస్తు చేసుకునే వారికి క్రెడిట్ స్కోరు తక్కువ లేదా సున్నా ఉన్నప్పుడు బ్యాంకులు రుణ దరఖాస్తులను తిరస్కరించలేవని మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2025, జనవరి 6 నాటి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాస్టర్ డైరెక్షన్‌లో క్రెడిట్ సంస్థలకు సూచనలు జారీ అయ్యాయి. మొదటిసారి రుణం తీసుకునే వారి దరఖాస్తులను క్రెడిట్ హిస్టరీ లేని కారణంతో తిరస్కరించకూడదని సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అంతేకాకుండా రుణ దరఖాస్తులకు కనీస క్రెడిట్ స్కోర్‌ అనేది ఏమీ ఆర్‌బీఐ నిర్దేశించలేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే, మొదటిసారి రుణగ్రహీతలకు సిబిల్ స్కోర్ తప్పనిసరి కాకపోవచ్చు, కానీ ఇప్పటికీ బ్యాంకులు ఆయా రుణ దరఖాస్తుల విషయంలో తగిన శ్రద్ధ వహించాలని, దరఖాస్తుదారుల గురించి తనిఖీ నిర్వహించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. ఈ తనిఖీలలో క్రెడిట్ హిస్టరీ, పేమెంట్ హిస్టరీ, ఆలస్యంగా చేసిన రీపేమెంట్లు, రుణాల సెటిల్మెంట్లు, రైటాఫ్ వంటి వివరాలను చూడాలని పేర్కొంది.

Next Story