- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India-China: భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా
చైనాతో మనదేశ వాణిజ్య లోటు 112.16 బిలియన్ డాలర్లకు పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమెరికాను దాటి చైనా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. ఈ కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 151.1 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 14.09 లక్షల కోట్ల)కు చేరుకోగా, చైనాతో మనదేశ వాణిజ్య లోటు 112.16 బిలియన్ డాలర్లకు పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు వరుసగా నాలుగేళ్ల పాటు అమెరికానే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగింది. కానీ, గతేడాదిలో చైనాకు భారత ఎగుమతులు 36.66 శాతం పెరిగి 19.47 బిలియన్ డాలర్ల(1.81 లక్షల కోట్ల)కు చేరుకోగా, దిగుమతులు 16 శాతం పెరిగి 131.63 బిలియన్ డాలర్ల(12.27 లక్షల కోట్ల)కు చేరాయి. 2024-25లో 99.2 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు, 2025-26 నాటికి చారిత్రాత్మక గరిష్ఠం 112.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరోవైపు, అమ్రికాకు మన ఎగుమతులు 0.92 పెరిగి 87.3 బిలియన్ డాలర్లకు, దిగుమౌలు 15.95 శాతం పెరిగి 52.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 40.89 బిలియన్ డాలర్ల నుంచి 34.4 బిలియన్ డాలర్లకు తగ్గిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.






