- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China-US: ట్రంప్ 'పరస్పర సుంకం'పై చైనా 'ప్రతీకార సుంకం'
అమెరికా అనుసరిస్తున్న తీరు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధానికి డ్రాగన్ దేశం ధీటుగానే బదులిస్తోంది. చైనా ఉత్పత్తులపై 34 శాతం సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటన వెలువడిన ఒకరోజు వ్యవధిలోనే చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా అమెరికా ఉత్పత్తులపై అదనంగా 34 శాతం సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులకు ఇది వర్తిస్తుందని, ఈ సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అమెరికా అనుసరిస్తున్న తీరు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించింది. ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు దిగుతోందని ఆరోపించింది. చైనా ప్రభుత్వ టారిఫ్ చట్టం, విదేశీ వ్యాపారాల చట్టం, కస్టమ్స్ చట్టం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారమే అమెరికా దిగుమతి ఉత్పత్తులపై అదనపు సుంకం విధిస్తామని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా అమెరికా తీరు ప్రపంచ వాణిజ్య సంస్థల నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ క్రమంలో మా ప్రయోజనాల కోసం బదులు స్పందించే హక్కు తమకుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఇప్పటికే అమెరికా దిగుమతులపై అమలవుతున్న పన్నులకు అదనంగా 34 శాతం టారిఫ్ ఉంటుందని చైనా స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న పన్ను, ఇతర మినహాయింపు విధానాలు కూడా కొనసాగుతాయి, చైనాకు బయలుదేరిన సరుకులు మే 13వ తేదీ కంటే ముందు చేరుకుంటే వాటికి మినహాయింపు ఇస్తామని వివరించింది.
దీనికి అదనంగా, చైనా ఏప్రిల్ 4 నుంచి సమారియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటెటియం, స్కాండియం, యట్రియం వంటి కీలక మీడియం, హెవీ భూమి మూలకాలపై ఎగుమతి నియంత్రణలను విధించింది. ఈ అరుదైన మూలకాలు సెమీకండక్టర్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, సైనిక పరికరాల తయారీలో కీలకం. గురువారం నాటి ప్రకటనలో ట్రంప్ చైనా ఉత్పత్తులప 34 శాతం విధించారు. ఈ ఏడాది ప్రారంభంలో విధించిన 20 శాతం లెవీతో కలుపుకుంటే మొత్తం పెంపు 54 శాతానికి చేరుకుంది. ఈ కారణంగానే చైనా కూడా ధీటుగా అమెరికాపై వాణిజ్య యుద్ధం ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య కొన్నేళ్ల నుంచి వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధాలు బలంగానే కొనసాగుతున్నాయి. 2017లో చైనా 154 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా, 2024 నాటికి ఇది 164 బిలియన్ డాలర్లకు పెరిగింది.






