నీళ్లను తెగ తాగుతున్న ChatGPT!

by Disha Web Desk 17 |
నీళ్లను తెగ తాగుతున్న ChatGPT!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సంచలనం సృష్టిస్తున్న కృతిమ మేధ యాప్ ChatGPT గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక యూజర్ 20 నుంచి 50 ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పాలంటే 500ml(అర లీటర్) వాటర్‌ను తాగుతున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ChatGPT కి సంబంధించిన సర్వర్లు ఉపయోగించుకునే విద్యుత్తు, సర్వర్లను చల్లబరచడానికి అవసరం అయ్యే వాటర్ ఆధారంగా అమెరికా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పేర్కొన్నారు. నీరు లేకపోతే కృతిమ మేధ లేదని, దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే తప్పనిసరిగా నీరు అవసరమని వారు తెలిపారు.



సాధారణంగా సర్వర్లు 10-27 డిగ్రీల సెల్సియస్ వద్ద పని చేస్తాయి. ఈ ఉష్ణోగ్రతను కొనసాగించడానికి పెద్ద కూలింగ్ టవర్‌లను ఉపయోగిస్తారు. అయితే, సర్వర్లు వినియోగించే ప్రతి యూనిట్ (కిలోవాట్-గంట) విద్యుత్ కోసం, కూలింగ్ టవర్లు ఒక గాలన్ (3. 8 లీటర్లు) నీటిని ఉపయోగిస్తాయి. దీంతో సర్వర్లు భారీగా నీళ్లు త్రాగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.



Next Story