- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maruti Suzuki: తక్కువ ఛార్జింగ్ సదుపాయాలే ఈవీ కొనుగోళ్లకు ప్రాథమిక అడ్డంకి: మారుతీ సుజుకి
వాహనాల డ్రైవింగ్ రేంజ్ విషయంలో కస్టమర్లు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోళ్లు, వాడకం వేగంగా లేకపోవడానికి పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ముఖ్య కారణమని ప్యాసింజర్ కార్ల దిగ్గజం మారుతీ సుజుకి అభిప్రాయపడింది. ఛార్జింగ్ సదుపాయాలు ఈవీల వాడకంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే, వాహనాల డ్రైవింగ్ రేంజ్ విషయంలో కస్టమర్లు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటిసారి కారును కొనేవారు ఈవీని ఎంచుకోవడానికి సందేహిస్తున్నారు. సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఈవీలను మొదటి ఎంపికగా చేసుకునేందుకు ఆసక్తి చూపించడంలేదని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పాథో బెనర్జీ చెప్పారు. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి, కానీ మొత్తం వాహన మార్కెట్లో ఈవీ బేస్ ఇప్పటికీ తక్కువగానే ఉంది. మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో ఈవీల వాటా 4.5 శాతం ఉంది. ఇది 2.4 శాతం నుంచి రెట్టింపు పెరిగింది. కానీ స్థిరంగా కొనసాగుతుందా అనేది సందేహమేనని పార్థో అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే తాము మొదటి ఎలక్ట్రిక్ మోడల్ ఈ-విటారాను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. కాగా, పరిశ్రమల సమాఖ్య ఫాడా ఇటీవలి డేటా ప్రకారం, జూలైలో ఈవీ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 93 శాతం పెరిగిన సంగతి తెలిసిందే.






