BIG BREAKING : మళ్లీ షాకిచ్చిన కేంద్రం.. వెండి దిగుమతులపై ఉక్కుపాదం

by Naga Rani Yarlagadda |

బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని ఇటీవలే కేంద్రప్రభుత్వం 15 శాతానికి పెంచి షాకిచ్చింది.

BIG BREAKING : మళ్లీ షాకిచ్చిన కేంద్రం.. వెండి దిగుమతులపై ఉక్కుపాదం
X

దిశ, వెబ్‌‌‌‌డెస్క్ : బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని ఇటీవలే కేంద్రప్రభుత్వం 15 శాతానికి పెంచి షాకిచ్చింది. దాని నుంచి తేరుకునేలోపే.. కొనుగోలుదారులకు మరో పిడుగులాంటి వార్త చెప్పింది. పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. అన్ని రకాల వెండి దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోకి వచ్చే వెండి దిగుమతుల్ని మరింత కఠినంగా పర్యవేక్షించడం, క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తక్షణమే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని DGFT పేర్కొంది.

99.9 శాతం ప్యూరిటీ ఉన్న సిల్వర్ బార్స్ గతంలో ఫ్రీ కేటగిరీలో ఉంచేది. వీటిని ఇప్పుడు నిషేధిత లేదా నియంత్రిత కేటగిరీలోకి మారుస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇతర నిర్దిష్ట వెండి బిస్కెట్లను కూడా నియంత్రిత జాబితాలోకి చేర్చారు. ఈ నిబంధనలతో ఇకపై వెండిని ఇష్టానుసారం దిగుమతి చేసుకునే వీలుండదు. వెండిని దిగుమతి చేసుకోవాలంటే.. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇటీవలే అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద బంగారంపై కేంద్రం 100 కిలోల పరిమితిని విధించింది. ఈ స్కీమ్ కింద దేశీయ జ్యువెలరీ ఎగుమతిదారులు తమకు కావలసిన బంగారాన్ని జీరో డ్యూటీతో దిగుమతి చేసుకునే వీలుంటుంది. దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. అడ్వాన్స్ ఆథరైజేషన్, పర్యవేక్షన నియమ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బంగారం, వెండి దిగుమతులపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాలు వ్యాపారస్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

Next Story