- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST: ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదన
మంత్రుల బృందం బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటి అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని కేంద్రం ప్రతిపాదించిందని బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఇన్సూరెన్స్ కమిటీ కన్వీనర్ సామ్రాట్ చౌదరి బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. 13 మంది సభ్యులతో కూడిన మంత్రుల బృందం బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటి అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. జీవిత, ఆరోగ్య బీమాపై మంత్రుల బృందం తన నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పిస్తుంది. కొన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆందోళనలను కూడా ఈ నివేదికలో చేర్చనున్నట్లు ఆయన చెప్పారు. రేట్లను తగ్గించడానికి సభ్యులందరూ ఆమోదం తెలిపారు. కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలియజేశాయని, రేట్లపై తుది నిర్ణయం కౌన్సిల్ తీసుకుంటుందని పేర్కొన్నారు. బీమాపై కేంద్రం చేసిన మినహాయింపు ప్రతిపాదన ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా చేసింది. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని మినహాయించడం వల్ల కేంద్రానికి ఏటా దాదాపు రూ.9,700 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా వేశామని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు.






