- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
EV Vehicles: రూ. 10 వేల కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని నోటిఫై చేసిన కేంద్రం
దిశ, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ప్రమోషన్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తయారీ సామర్థ్యాల అభివృద్ధికి కేంద్రం ఇటీవల పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఈవీల కోసం రూ. 10,900 కోట్లు కేటాయిస్తూ సోమవారం కేంద్రం నోటిఫై చేసింది. ఈ పథకం అక్టోబరు 1 నుంచి 2026, మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. దేశంలో ఈవీ వినియోగం పెంచేందుకు ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రారంభ కార్యక్రమం మంగళవారం(అక్టోబర్ 1) జరగనుంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ప్రభుత్వం ఈవీ టూ-వీలర్లు, త్రీ-వీలర్లు, ఈ-ఆంబులెన్స్, ఈ-ట్రక్కుల కొనుగోళ్లపై సబ్సిడీ ఇవ్వనుంది. పథకం అమల్లో ఉన్న సమయంలో ఈ-బస్సులకు అత్యధిక మొత్తం రూ. 4,391 కోట్లను, టూ-వీలర్లకు రూ. 1,771 కోట్లు, త్రీ-వీలర్లకు మొదటి ఏడాది కిలోవాట్‌కు రూ. 5,000, ఆ తర్వాత ఏడాది కిలోవాట్‌కు రూ. 2,500 చొప్పున కేటాయించారు. తొలి ఏడాది ఈవీ టూ-వీలర్లకు అత్యధికంగా రూ. 10 వేలు, ఈ-రిక్షాకు రూ. 25 వేలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. రెండో ఏడాది టూ-వీలర్లకు రూ. 5,000, ఈ-రిక్షాలకు రూ. 12,500 చొప్పున సబ్దిడీ అందించనుంది.