GST Reforms: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో జీఎస్టీ తగ్గింపులను పర్యవేక్షిస్తున్న కేంద్రం

by S Gopi |

సెప్టెంబర్ 30 నాటికి క్షేత్ర స్థాయిలో జీఎస్టీ పన్ను రేట్ల తగ్గింపు అమలు గురించి నివేదిక వస్తుందని వివరణ ఇచ్చింది.

GST Reforms: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో జీఎస్టీ తగ్గింపులను పర్యవేక్షిస్తున్న కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి అన్ని రకాల నిత్యావసరాలు, వస్తువులు మొదలుకొని బైకులు, కార్ల వరకు ధరలు తగ్గాయి. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనాలను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కస్టమర్లకు బదిలీ చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ధరల మార్పులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోందని, వచ్చిన ఫిర్యాదులను తక్షణం స్పందించడం వీలవదు. సెప్టెంబర్ 30 నాటికి క్షేత్ర స్థాయిలో జీఎస్టీ పన్ను రేట్ల తగ్గింపు అమలు గురించి నివేదిక వస్తుందని వివరణ ఇచ్చింది. ఇటువంటి ఫిర్యాదులపై మొండిగా స్పందించకూడదని కోరుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫిర్యాదుల కోసం యాంటీ-ప్రాఫిటీరింగ్ మెకానిజం ప్రారంభించబడనప్పటికీ, ప్రభుత్వం ధరలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. చాలా కంపెనీలు స్వయంగా ముందుకు వచ్చి ధరలను తగ్గించాయని, పన్ను తగ్గింపు ప్రయోజనాలను అందజేస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కాగా, ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలోని కౌన్సిల్ జీఎస్టీ చట్టంలో శ్లాబుల సంఖ్యను రెండుకు తగ్గించింది. దీంతో ప్రస్తుతం అన్ని రకాల వస్తువులు, సేవలపై 5 శాతం, 18 శాతం పన్నులు అమలవుతాయి. లగ్జరీ, పొగాకు, అల్కాహాల్‌పై అత్యధికంగా 40 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.

Next Story