- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EVs: ఈవీలపై రాయితీలను జూలై 31 వరకు పొడిగించిన కేంద్రం
ఈ నెల 31తో ముగియనున్న ఈ గడువును, జూలై 31కి పొడిగిస్తూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం పీఎం ఈ-డ్రైవ్ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోళ్లపై అందించే సబ్సిడీల గడువును పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 31తో ముగియనున్న ఈ గడువును, జూలై 31కి పొడిగిస్తూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే, ఈ-రిక్షా, ఈ-కార్టు వాహనాల సబ్సిడీలను కూడా మార్చి 31, 2028 వరకు పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారిక అంచనాల ప్రకారం, పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద టూ-వీలర్ల కోసం కేటాయించిన మొత్తం రూ. 1,772 కోట్లలో, ఇప్పటివరకు రూ. 1,259.91 కోట్లు రాయితీ రూపంలో ఖర్చు అయ్యాయి. కాగా, తొలిసారిగా 2024 అక్టోబర్ 1న ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీవీలర్లు, ఈ-అంబులెన్సులు, ఈ-ట్రక్కులపై కేంద్రం రాయితీ అందిస్తోంది. మొత్తం 14 లక్షల ఈవీ టూవీలర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 24.8 లక్షలు విక్రయం అయ్యాయి. ఒక్క టూవీలర్ విభాగంలోనే 10 లక్షల యూనిట్లు అమ్ముడైనట్టు కేంద్రం అంచనా వేస్తోంది.






