RBI Ombudsman: ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ పరిధిలోకి కేంద్ర, రాష్ట్ర సహకార బ్యాంకులు

by S Gopi |

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తప్ప అన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఈ పథకంలో చేరతాయి.

RBI Ombudsman: ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ పరిధిలోకి కేంద్ర, రాష్ట్ర సహకార బ్యాంకులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అంబుడ్స్‌మన్ పథకం పరిధిలోకి వస్తాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మంగళవారం వెల్లడించింది. దీంతో ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం కిందకు కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైమరీ (పట్టణ) సహకార బ్యాంకులు, రూ. 50 కోట్ల డిపాజిట్ పరిమాణం కలిగిన నాన్-షెడ్యూల్డ్ ప్రైమరీ (పట్టణ) సహకార బ్యాంకులు వస్తాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తప్ప అన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఈ పథకంలో చేరతాయి. వారు కస్టమర్ల నుంచి డిపాజిట్లు స్వీకరించేందుకు, కస్టమర్ ఇంటర్‌ఫేస్‌కు అర్హత పొందుతాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు కూడా అంబుడ్స్‌మన్ కిందకు వస్తాయి. వీటిని అంబుడ్స్‌మన్ పథకం పరిధిలోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులకు ఎక్కువ రక్షణ లభిస్తుంది. దీనికి ముందు, అనేక సహకార బ్యాంకులు ఆర్‌బీఐ ఫిర్యాదుల పథకం కిందకు చేరలేదు. కొన్ని సంస్థలు పాక్షికంగా మాత్రమే కవర్ అయ్యాయి. తాజా మార్పుతో ఎక్కువ మంది కస్టమర్‌లు తమ బ్యాంకు నుంచి ఏవైనా లోపాలు, సేవలు లభించకపోతే పరిష్కారం, పరిహారం కోరే అవకాశాన్ని పొందుతారు. తద్వారా బ్యాంకులు మరింత జవాబుదారీని కలిగి ఉంటాయి.

Next Story