- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PMVVY: ప్రైవేట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.10,000 పెన్షన్ అందించే కేంద్ర ప్రభుత్వ స్కీం ఇదే..
PMVVY: ప్రధాన మంత్రి వయో వందన యోజన (PMVVY) సాధారణంగా పెన్షన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే.

దిశ, వెబ్ డెస్క్: PMVVY: ప్రధాన మంత్రి వయో వందన యోజన (PMVVY) సాధారణంగా పెన్షన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. వీరికి మాత్రమే ప్రభుత్వం పెన్షన్ చెల్లిస్తుంది. అయితే ప్రైవేటు ఉద్యోగులకు కూడా పెన్షన్ కావాలంటే కొన్ని స్కీములు ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు ప్రతినెల నిర్ణీత మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న అలాంటి స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ స్కీం పేరు ప్రధానమంత్రి వయో వందన యోజన. 60 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల పెన్షన్ కల్పించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి వయో వందన యోజన రూపొందించారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతినెల పెన్షన్ పొందాలి అనుకున్నట్లయితే కనీస వయసు 60 గా ఉంది. చందాదారులు తాము అనుకూలమైన విధంగా పెన్షన్ ఎంచుకోవచ్చు.
ఇందులో భాగంగా నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక ప్రాతిపదికన మీరు పెన్షన్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ స్కీం కింద మీరు నెలకు రూ. 1000 పెన్షన్ పొందాలంటే కనీస పెట్టుబడి రూ. 1.5 లక్షలుగా ఉంది. నెలకు రూ. 10,000 వరకు పెన్షన్ పొందాలంటే గరిష్ఠ పెట్టుబడి: రూ. 15 లక్షలుగా ఉంది. ఇక వడ్డీ విషయానికి వస్తే పాలసీ ప్రారంభ సమయంలో నిర్ణయించిన రేటుతో స్థిరమైన వడ్డీ మీకు లభిస్తుంది.
ప్రస్తుతం సుమారు 7.4% వడ్డీని అందిస్తున్నారు. ఈ స్కీం ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ స్కీములు అందుబాటులో ఉండవు. ఈ పథకాన్ని Life Insurance Corporation of India (LIC) నిర్వహిస్తుంది. LIC శాఖలలో నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డిటైల్స్, ఫొటో, వయస్సు నిర్ధారణ పత్రం అవసరం అవుతాయి.






