- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EPS-95 Pension: పెన్షన్ పెంపుపై కేంద్రం తీపికబురు.. ఈపీఎస్ 95 పెన్షనర్లకు అప్‌డేట్
EPS-95 Pension: ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 95(EPS-95) పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు గుడ్ న్యూస్.

దిశ,వెబ్‌డెస్క్: EPS-95 Pension: ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 95(EPS-95) పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఈపీఎస్(EPS-95) కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కనీస పెన్షన్ పెంపు సహా ఇతర డిమాండ్ల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ హామీ ఇచ్చినట్లు ఆందళన కమిటీ తెలిపింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కనీస పెన్షన్ సహా పలు డిమాండ్ల సాధన కసం 2014 నుంచి పోరాటం చేస్తున్న ఈపీఎస్ 95(EPS-95) ఆందోళన కమిటీ శనివారం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపింది. ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ(Man Sukh Mandaviya)తో జరిపిన చర్చల్లో పెన్షన్ పెంపు సహా పలు డిమాండ్లపై సానుకూల స్పందన వచ్చినట్లు పెన్షనర్ల సంఘం తెలిపింది. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశంలోని సుమారు 78లక్షల మందికి ప్రయోజనం కలగనుందని ఆందోళన కమిటీ వెల్లడించింది.
ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 95(EPS-95 Pension) కింద చెల్లించే కనీస పెన్షన్(EPS-95 Pension) ను రూ. 7వేలకు పెంచాలని ఆందోళన కమిటీ ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తోంది. చివరిగా 2014లో కనీస పెన్షన్ రూ. 1000కి పెంచారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయలేదు. దానిని రూ. 7వేలపైకి పెంచాలని దీంతోపాటుగా పెన్షనర్లు, వారి జీవిత భాగస్వామికి ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. అలాగే అధిక పెన్షన్ కు సంబంధించిన దరఖాస్తుల్లోని తప్పులను సవరించాలని పెన్షనర్లు కోరుతున్నారు.
అయితే ఈ విషయంపై ఫిబ్రవరి 1,2025 రోజున ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025-26లోనే ప్రకటన ఉంటుందని పెన్షనర్లు భావించారు. కానీ ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో పెన్షనర్లు ఒకింత నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మికశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో ఫిబ్రవరి 21,2025 రోజున పెన్షన్ ఆందోళన కమిటీ భేటీ అయ్యింది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ హామీ ఇచ్చినట్లు ఆందోళన కమిటీ జాతీయ అధ్యక్షుడు అశోక్ రౌత్ వెల్లడించారు.
ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ వడ్డీపై నిర్ణయం తీసుకునేందుకు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఫిబ్రవరి 28, 2025రోజున సమావేశం అవుతున్నారు. పీఎఫ్ ఖాతా వడ్డీతోపాటు ఈపీఎస్ 95 పెన్షన్(EPS-95 Pension) పెంపుపై సానుకూల నిర్ణయం ఉంటుందని ఆందోళన కమిటీ చెబుతోంది.






