- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్‌బీఐకి లండన్ 'రిస్క్ మేనేజర్ అవార్డు'
by S Gopi |
సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్-2024లో భాగంగా లండన్‌కు చెందిన సెంట్రల్ బ్యాంకింగ్ రిక్స్ మేనేజర్ అవార్డును సొంతం చేసుకుంది

X
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ సెంట్రల్ బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అరుదైన ఘనతను దక్కించుకుంది. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్-2024లో భాగంగా లండన్‌కు చెందిన సెంట్రల్ బ్యాంకింగ్ రిక్స్ మేనేజర్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 'సంస్థలో కొత్త ఎంటర్‌ప్రైజ్-వైడ్ రిస్క్ మేనేజ్‌మెంట్(ఈఆర్ఎం) ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిన నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్-2024లో భాగంగా లండన్‌లోని సెంట్రల్ బ్యాంకింగ్, రిస్క్ మేనేజర్ అవార్డుకు ఆర్‌బీఐని ఎంపిక చేసిందని ' ఎక్స్‌లో ట్వీట్ చేసింది. 12,000 మంది కంటే ఎక్కువ సిబ్బందితో ఆర్‌బీఐ అతి పెద్ద సంస్థగా కొత్త ఈఆర్ఎం ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం అంత సులభం కాదని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.
Next Story






