Air Conditioners : AC లపై కేంద్రం కొత్త రూల్

by Muthe.Rajitha |

ఎయిర్ కండీషనర్ల(AC)పై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకు రానుంది.

Air Conditioners : AC లపై కేంద్రం కొత్త రూల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎయిర్ కండీషనర్ల(AC)పై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకు రానుంది. విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించే చర్యల్లో భాగంగా ఏసీ టెంపరేచర్(AC Temperature) కు పరిమితి విధించనుంది. కనిష్టంగా 20 డిగ్రీ సెల్సియస్ నుంచి గరిష్టంగా 28 డిగ్రీల మధ్యే ఉండేలా నిబంధనలు సవరించబోతున్నట్టు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Manoharlal Khattar) పేర్కొన్నారు. త్వరలోనే దీనిని అమలు చేస్తామని తెలియజేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏసీల్లో కనిష్టంగా 16 డిగ్రీలు, 18 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ఎయిర్ కండీషనర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కేంద్రం అమలు చేసే నిర్ణయంతో ఇకపై కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుంచి ప్రారంభం అయ్యే ఏసీలు రానున్నాయి. నిజానికి ఏసీలు 24-25 మధ్య వినియోగిస్తే చాలా విద్యుత్ ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story