- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెక్స్‌టైల్స్ రంగానికి బిగ్ రిలీఫ్.. కాటన్ దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని తొలగించిన కేంద్రం
అమెరికా టారిఫ్ నిర్ణయంతో నష్టపోయే టెక్స్ టైల్స్ రంగానికి కేంద్ర బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కాటన్ దిగుమతలుపై ఉన్న 11 శాతం కస్టమ్స్ డ్యూటిని 40 రోజుల పాటు తొలగించింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ (Donald Trump's tariffs) నిర్ణయాలతో భారత్ లోని అనేక రంగాలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో టెక్స్ టైల్స్ రంగానికి (Textiles sector) కేంద్ర బిగ్ రిలీఫ్ ను కల్పించింది. ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతో టెక్స్‌టైల్స్ రంగంలో వచ్చే నష్టాలను భరించడానికి.. కాటన్ దిగుమతులపై ఉన్న 11 శాతం కస్టమ్స్ డ్యూటి (Customs duty)ని తొలగించినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం 42 రోజుల వరకు అంటే నేటి నుంచి వచ్చే నెల 30 వరకు అమల్లో ఉండనున్నట్లు జీవో విడుదల చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం టెక్స్ టైల్స్ ఇండస్ట్రీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుంది.
ఇదిలా ఉంటే అమెరికా 50 శాతం టారిఫ్ ల నిర్ణయంతో.. భారత వస్త్ర పరిశ్రమ సమాఖ్య (CITI) వంటి పరిశ్రమ సంస్థలు ప్రభుత్వం పత్తి దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని కోరాయి. దీంతో ఈ రంగాన్ని మరింత పోటీతత్వం తీర్చిదిద్దవచ్చని కేంద్రానికి తెలపగా వారి డిమాండ్ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భారతదేశ వస్త్ర రంగం ఇప్పటికే కార్మికుల కొరత, పరిమిత ఉత్పత్తి సామర్థ్యంతో సతమతమవుతోంది. ఎగుమతిదారులు ఉత్పత్తిని విదేశాలకు తరలించే అవకాశం ప్రభుత్వం యొక్క "మేక్ ఇన్ ఇండియా" తయారీ రంగానికి మరింత సవాలును కలిగిస్తుంది.






