పండగల నేపథ్యంలో చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

by Disha Web Desk 17 |
పండగల నేపథ్యంలో చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: పండగ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో చక్కెర ఎగుమతులపై ఆంక్షలను అక్టోబర్ 31 వరకు విధించగా, తాజాగా ఆ గడువును మరింత కాలం పొడిగించింది. ఈ ఆంక్షలు ఎప్పటి వరకు ఉంటాయో ప్రభుత్వం పేర్కొనలేదు. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ముడి చక్కెర, తెల్ల చక్కెర , శుద్ధి చేసిన చక్కెర, సేంద్రీయ చక్కెరపై ఈ ఆంక్షలు ఉంటాయి.

ప్రస్తుతం సీజన్ మొత్తం కూడా పండగలతో నిండి ఉంది. ఇలాంటి తరుణంలో ప్రజలు రోజు వినియోగించే చక్కెర అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. దీంతో ధరలు కూడా పెరగకుండా ఉంటాయని డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ పేర్కొంది. CXL, TRQ పన్ను రాయితీ కింద ఐరోపా సమాఖ్య, అమెరికాకు ఎగుమతి చేసే చక్కెర ఎగుమతులపై ఈ ఆంక్షలు వర్తించవని అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed