Cement: సిమెంట్ ధరలకు రెక్కలు

by S Gopi |

దేశవ్యాప్తంగా సిమెంట్ తయారీ కంపెనీలు జూన్ త్రైమాసికానికి సంబంధించి లాభాల మార్జిన్లు దెబ్బతింటాయని భావిస్తున్నాయి.

Cement: సిమెంట్ ధరలకు రెక్కలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు నిర్మాణ రంగంపైనా ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, అధిక డిమాండ్, ప్రపంచ సరఫరా అంతరాయాల వల్ల సిమెంట్ తయారీ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అల్ట్రాటెక్ సిమెంట్ వంటి ప్రధాన సంస్థలు ఇప్పటికే పెంచాలని నిర్ణయించగా, ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఈక్విరస్ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్య యుద్ధం వల్ల ఏర్పడిన సవాళ్ల మధ్య దేశవ్యాప్తంగా సిమెంట్ తయారీ కంపెనీలు జూన్ త్రైమాసికానికి సంబంధించి లాభాల మార్జిన్లు దెబ్బతింటాయని భావిస్తున్నాయి. ముడిసరుకులు సహా ఇతర ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయడకుండా ఎక్కువ రోజుకు కొనసాగించలేమని, ఇప్పటికే విపరీతంగా పెరిగిన ఇంధన ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులను భరించడం కష్టంగా ఉందని కంపెనీ స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా ఉండనుంది. దీనివల్ల 50 కిలోల సిమెంట్‌ బస్తాపైన రూ. 40-50 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పెంపు మరో వారం రోజుల్లో ఉండవచ్చని, దీని గురించి సంకేతాలు అందినట్లు రిటైల్‌ డీలర్లు పేర్కొన్నారు.

Next Story